05-07-2024 01:41:10 AM
ఢిల్లీలో కూలీలతో రాహుల్‌గాంధీ మాటామంతీ
న్యూఢిల్లీ, జూలై 4: దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులే వెన్నెముక అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీలోని గురు తేజ్‌బహదూర్ నగర్‌లో కార్మికులను కలిశారు. వారితో కలిసి కొద్దిసేపు పార పని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వాట్సాప్ చానల్‌లో షేర్ చేశారు. ‘ఈ రోజు నేను జీబీఈ నగర్‌లో కార్మిక సోదరులను కలిసి వారి సమస్యలను తెలుసుకొన్నాను. వారి కష్టానికి హద్దులు లేవు. తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్న వీరికి తగిన న్యాయం అందాలి” అన్నారు.