నాగర్‌కర్నూలు, జనవరి 7 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కృష్ణ పరివాహక ప్రాంతాల్లో నిషేధిత అలవి వలలు విసిరే ముఠా వద్ద వెట్టి చాకిరీ చేస్తున్న ముగ్గురు కార్మికులకు మంగళవారం పెంట్లవెల్లి పోలీసులు, కార్మిక శాఖ అధి విముక్తి కల్పించారు. ఏపీలోని గుంటూరు మంగళగిరి ప్రాంతానికి చెందిన సుభాని, శ్రీమాన్నారాయణ, సలీం హైదరాబాద్‌లో పని చేసుకుంటుండగా అక్కడ గుం మేస్త్రిగా ఉన్న గురుమూర్తి పరిచమయ్యాడు.
గురుమూర్తి ఆ ముగ్గు కృష్ణ పరివాహ ప్రాంతాల్లోని పెంట్లవెల్లి, సింగోటం గ్రామ పరిసరాల్లోనీ కృష్ణా నదిలో అక్రమంగా అలవి వలలు విసిరే వ్యక్తి వద్దకు పని నిమిత్తం పంపించాడు. పనిలోకి తీసుకున్న వ్యక్తి బలవంతంగా నదిలోకి దింపుతూ, సమయ పాలన లే రాత్రి సమయంలో వెట్టి చేయించుకుంటున్నాడు.
దీంతో కార్మికులు దగ్గర్లోని కొంతమంది వ్యక్తుల సాయంతో బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. కార్మిక శాఖ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో ముగ్గురికి విముక్తి కల్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెట్టి చేయిం దళారులపై కేసులు నమోదు చేయకపోవడంతో అధికారుల తీరుపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు