calender_icon.png 31 October, 2024 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసిపేట గనిలో కార్మికునికి గాయాలు

11-08-2024 02:07:01 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట 1 గనిలో ట్రమర్ గా పనిచేస్తున్న సోమిశెట్టి శరత్ కుమార్ అనే కార్మికుడు గనిలో జరిగిన ప్రమాదానికి గురై శనివారం రాత్రి తీవ్రంగా గాయపడ్డాడు. దాని అధికారులు గాయపడ్డ కార్మికుడు శరత్ కుమార్ ను హుటా హుటిన సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో ప్రమాదకర పరిస్థితుల మధ్య పని చేయాల్సి వస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు పనిచేసే చోట సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.