calender_icon.png 26 January, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్‌తో కార్మికుడు మృతి

25-01-2025 12:00:00 AM

15 లక్షల పరిహారం ఇవ్వాలని మృతుడి కుటుంబీకుల ఆందోళన 

రాజేంద్రనగర్, జనవరి 24: కరెంట్ షాక్‌తో కార్మికుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. వివరాలు.. లక్ష్మీగూడ లోని వరుణ్ స్టీల్ ట్రేడర్స్ లో కొండల్ అనే కార్మికుడు స్టీల్ అన్లోడ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. అయితే ఈ విషయం గమనించిన యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. చాలాసేపటి తర్వాత అతడిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గమనించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 

రహదారిపై భారీగా ఆందోళన.. 

యాజమాన్యం నిర్లక్ష్యంతో కార్మికుడు మృతి చెందడంతో అతని కుటుంబీకులు బంధువులు భారీ ఎత్తున స్వగ్రామం నుంచి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 15 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై భారీగా వాహనాలు స్తంభించాయి. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.