calender_icon.png 26 December, 2024 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి

25-12-2024 10:37:15 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రంగంపేటకు చెందిన రేవన్‌ కుమార్(25) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రామారెడ్డి ఎస్ఐ నరేష్ తెలిపిన ప్రకారం... రంగంపేటకు చెందిన రేవన్‌కుమార్ కామారెడ్డి మున్సిపల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పని ముగించుకొని బైక్‌పై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేవన్ కుమార్ తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరిగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రేవన్ తాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు.