నల్లగొండ, జనవరి 12 (విజయక్రాంతి): పంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి మల్టీపర్పస్ వర్కర్ దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామా నికి చెందిన గంజి పాపయ్య (40) కొన్నేండ్లుగా పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం గ్రామంలో నీటిని పోసేందుకు పంచాయతీ ట్యాంకర్ తీసుకెళ్లా డు. నీటిని పోసి వస్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి రాయిపైకి దూసుకెళ్లి పల్టీకొట్టడంతో పాపయ్య దాని కిందపడి మృతి చెందాడు