calender_icon.png 1 April, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్ల పైనుంచి పడి వర్కర్ మృతి

30-03-2025 08:41:30 PM

మామకన్ను ఆశ్రమ స్కూల్లో ఘటన.. 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను ఆశ్రమ స్కూల్లో శనివారం రాత్రి మెట్ల పైనుంచి జారిపడి రోజువారి కూలీ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కాచనపల్లి గ్రామానికి చెందిన ఎం సతీష్ కుమార్ మామ కన్ను ఆశ్రమ పాఠశాలలో డైలీ వేసి వర్కర్ గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి పై అంతస్తు నుండి కిందికి దిగి వస్తున్న క్రమంలో కాలుజారి పడటం జరిగింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. విద్యార్థులు వార్డెన్కు సమాచారం ఇవ్వడంతో సతీష్ కుమార్ ను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. వర్ధన్ సనప రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.