calender_icon.png 30 November, 2024 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్లతో పని చేయాలి

30-11-2024 02:32:04 AM

  1. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
  2. మంత్రి సీతక్క ఆదేశాలు

మహబూబాబాద్, నవంబర్ 29: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు టార్గెట్లను పెట్టుకుని పని చేయాలని, జిల్లా కేంద్రంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడ మండల కేంద్రంలోని రైతువేదికలో జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండు మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ద్వారా సమీక్షలు నిర్వహించుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తెలెత్తకుండా టార్గెట్ లను నిర్దేశించుకొని పనిచేయాలన్నారు. ఐటీడీఏ నిధుల ద్వారా లైబ్రరీ, కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలని సూచించారు. మండల కేంద్రంలో పెద్ద హాలులా ఫంక్షన్ హాలును నిర్మించి, విద్యార్థులకు, యువతకు నైపుణ్యాతా శిక్షణ కార్యక్రమాలు నిరర్వహిం చాలన్నారు.

అందుకు ప్రతిపాదనలు పం పించాలని అధికారులకు సూచించారు. వై ద్య శాఖలో రెండు మండలాలకు సంబంధించిన ఖాళీల వివరాలు తెలపాలని కోరారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారం అందించాలని సీతక్క ఆదేశించారు. ఈ సమీక్షలో డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో హరిప్రసాద్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ అజయ్‌కుమార్, ఈఈ విద్యాసాగర్, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ నరేష్, గంగారం ఎంపీడీవో అప్పారావు, డీహెచ్‌ఎస్‌వో మరియన్న, కొత్తగూడ ఎమ్మార్వో రమాదేవి పాల్గొన్నారు.