calender_icon.png 25 March, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకితభావంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలి

23-03-2025 07:57:29 PM

డైరెక్టర్ పిపి వెంకటేశ్వర్లు...

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో విధి నిర్వహిస్తున్న ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో అంకితభావంతో పనిచేయడం ద్వారా నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుందని సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఏరియాలోని కేకే ఓసీపీని ఆదివారం సందర్శించి పని స్థలాలను పరిశీలించారు. అనంతరం ఒసీపీలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత తీరుపై గని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు.

ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేయడం ద్వారా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్నారు. ఆర్థిక సంవత్సరం మరో వారం రోజుల్లో ముగియనున్నందున రోజు వారీగా అధిక బొగ్గు ఉత్పత్తి సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం దేవేందర్, బెల్లంపల్లి రీజినల్ సేఫ్టీ జిఎం రఘు కుమార్, ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, కేకేఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, అన్ని గనుల మేనేజర్లు పాల్గొన్నారు.