calender_icon.png 8 January, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకిత భావంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించాలి

06-01-2025 07:57:59 PM

సింగరేణి డైరెక్టర్ (పి&పి) వెంకటేశ్వర్ రెడ్డి...

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్& ప్రాజెక్ట్) జి వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. సోమవారం ఏరియా సింగరేణి జీఎం జి దేవేందర్ తో కలిసి ఏరియాలోని కేకే ఓసీపీ సందర్శించి పని ప్రదేశాలు పరిశీలించడంతో పాటు ఉత్పత్తి, ఉత్పాదకత పై సమీక్షించారు. రవాణాకు సంబంధించిన వివరాలను  అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేసి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, కేకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, కేకే ఓసి గని మేనేజర్ రామరాజు, సేఫ్టీ అధికారి కుష్వాలు  పాల్గొన్నారు.