31-03-2025 05:52:10 PM
జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ మహిపాల్..
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా జాతీయ మానవ హక్కుల కమిటీ ప్రతినిధులు కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా చైర్మన్ మహిపాల్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో వివిధ మండలాల చైర్మన్ లను జనరల్ సెక్రటరీలను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఎన్ హెచ్ఆర్ సి సమావేశంలో ఎన్ హెచ్ ఆర్ సి విధి విధానాలు తెలుపుతూ ప్రజా సమస్యలపై అధికారుల వద్దకు చేరే విధంగా చూడాలని దొడ్డి దారిలో పనిచేస్తున్న అధికారులను ప్రశ్నించే విధంగా ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులు పనిచేయాలని సూచించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలని ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులకు తెలిపారు. ఎన్ హెచ్ ఆర్ సి ని ప్రజల ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేయాలని కోరారు. గతంలో పనిచేయని మండల చైర్మన్ లను తీసి వేస్తూ వారి స్థానంలో నూతన చైర్మన్ లను నియమిస్తూ వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సందీప్, జనరల్ సెక్రెటరీ విజయ భాస్కరరావు, నర్సింలు జాయింట్ సెక్రెటరీ రాజిరెడ్డి, కన్వీనర్ రవీందర్ రెడ్డి, మహిళా కన్వీనర్ తేజశ్రీ, మీడియా కన్వీనర్ నారాయణ, వివిధ మండలాల చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.