11-12-2024 01:14:20 AM
నిజామాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి):విద్యార్థినులు ఉన్నత లక్ష్యంతో విద్యాభ్యాసం చేసి లక్ష్యా లను చేరుకోవాలని నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్ జడ్జి కుంచాల సునిత సూచించారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థిదశ నుంచే క్రమశిక్షణతో ప్రతి మహిళ ఉన్నతంగాతమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లాన్యాయ సేవా సంస్థ కార్యదర్శి పద్మావతి, కళా శాల ప్రిన్సిపాల్ బుద్ది రాజు, జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ పాల్గొన్నారు.