l బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గెడం నగేష్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): కార్యకర్తలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గెడం నగేష్ పిలుపునిచ్చారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మోదీని మరోసాని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రజలకు మోదీ పాలనపై విశ్వాసం ఉందన్నారు. అయోధ్యలో రాముని ప్రతిష్ఠ చేసి ప్రధాని మోదీ హిందువుల చిరకాల వాంఛను నెరవేర్చారని కొనియాడారు.
దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ మరోసారి అధికారంలోకి రావాల్సిందేనన్నారు. తనకు ఏజెన్సీవాసుల సమస్యల పై పూర్తి అవగాహన ఉందని, ఎన్నికల్లో గెలిచి ప్రజాసమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశాల్లో ఎమ్మెల్యేలు పాయల శంకర్, పాల్వాయి హరీష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, పార్టీ ముఖ్యనేతలు అల్లాపూర్ శ్రీనివాస్, భూమన్న, ముస్తాపురే ఆశోక్, సుహాసినిరెడ్డి, చంద్ర, ధోని శ్రీశైలం, కొట్నాక విజయ్, చర్ల మురళీధర్, కాండ్రె విశాల్, కొంగ సత్యనారాయణ పాల్గొన్నారు.