calender_icon.png 21 September, 2024 | 4:10 PM

నేర రహిత సమాజం కోసం పాటుపడదాం

21-09-2024 01:21:28 PM

గుంజుపడుగు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం 

కార్డెన్ సెర్చ్ లో గుంజపడుగులో మంథని సిఐ రాజు

మంథని,(విజయక్రాంతి): నేర రహిత సమాజం కోసం పాటుపడదామని, గుంజుపడుగు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని శనివారం ఉదయం గుంజపడుగు గ్రామంలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్ లో మంథని సిఐ రాజు అన్నారు. తెల్లవారుజామునే మంథని సర్కిల్ లోని మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్ఐ నరేష్, రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ లతో పాటు సిబ్బందితో కలిసి సిఐ గ్రామంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు.  గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేసి అనుమాన స్పందన వ్యక్తులపై విచారించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని గ్రామస్తులతో సిఐ మాట్లాడారు. యువత ముత్తు పదార్థాలు కు దూరంగా ఉండాలని, గ్రామంలో శాంతి భద్రతల కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని పాత పేరు తీసేసి గ్రామానికి మంచి పేరు వచ్చే విధంగా అందరు సహకరించాలని సిఐ కోరారు.