తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం H-58 (TRVKS)...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామ సహాయం రఘురాం రెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా కొత్తగూడెం విచ్చేసినారు. ఆయనను సింగరేణి గెస్ట్ హౌస్ లో TRVKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చారుగుండ్ల రమేష్ ఆధ్వర్యంలో కలిసి విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైనా EPF to GPF, ఆర్టిజన్స్ కన్వర్షన్, గ్రేడ్ చేంజ్, సీనియర్ ఫోర్ మెన్ పోస్టుల మంజూరి, నాలుగు కంపెనీలలో నూతన పోస్టులు మంజూరి తదితర ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి అతి త్వరలో ఒక లెటర్ ద్వారా తెలియచేసి మీ సమస్యలను పరిష్కరించుటకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో TRVKS రాష్ట్ర నాయకులు సందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, YTPS రీజినల్ కార్యదర్శి నాదెళ్ల రవికుమార్, KTPS 5వ దశ బ్రాంచ్ అధ్యక్షులు మహమ్మద్ పఠాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.