calender_icon.png 23 November, 2024 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి

23-11-2024 05:51:09 PM

ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలు 

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు 

హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారానికి మన ఊరు మన కాంగ్రెస్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళుతున్నామని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ బాబు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో  శనివారం 9,20,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా వచ్చి తనకు చెప్పవచ్చని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సమగ్రకులగణన ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. సమగ్ర కులగల సర్వే పట్ల అవగాహన లేని వ్యక్తులు సామాజిక మధ్యమలలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. వీణవంక మండలంలో అభివృద్ధి పనుల కోసం 78 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలు కూడా వచ్చాయని, హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికినిధులు తీసుకోవస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట సీనియర్ నాయకులు దేశిని కోటి, తిరుపతి రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.