కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, బండి సంజయ్
కరీంనగర్, జూన్ 30 (విజయక్రాంతి)/చార్మినార్ : ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతిఒక్కరూ బాధ్యతగా తల్లి పేరిట ఒక మొక్క నాటాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కోరారు. ఆదివారం ఆయన తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో నోముల వీరేశం ఇంట్లో ప్రధాని మన్‌కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధం పర్యావరణానికి ఉందని, అందుకోసమే తల్లి పేరిట మొక్కలు నాటాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే, కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చాంద్రాయణగుట్ట ఏరియా కందికల్‌గేట్ ఇస్కాన్ టెంపుల్‌లో పూజలు నిర్వహించిన అనంతరం మన్‌కీ బాత్‌ను వీక్షించారు. మోదీ సారథ్యంలో భారత్ ప్రపంచదేశాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు.