యూత్ కాంగ్రెస్ నాయకులతో నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్...
పటాన్ చెరు (విజయక్రాంతి): నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యువజన కాంగ్రెస్ నాయకులందరూ పనిచేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ కోరారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ యువ నాయకులు కాట శ్రీనివాస్ గౌడ్ ను శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులను కాట అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా ప్రభుత్వానికి ప్రజలకు వారదిలా ఉంటూనే పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేలా పని చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల కాంగ్రెస్ యువజన నాయకులు పాల్గొన్నారు.