ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్‌శంకర్
ఆదిలాబాద్, అక్టోబర్ 6(విజయక్రాంతి): బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషిచేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా (టి) గ్రామంలో ఆదివారం బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో తాజా మాజీ సర్పంచ్ దారట్ల భాస్కర్, మాజీ ఉప సర్పంచ్ దేవల్ల కిషన్, పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె మోహన్‌తోపాటు పలువురు బీజేపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఎంపీ, ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, జిల్లా నాయకులు దారట్ల జీవన్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, నాయకులు కుంచెట్టి సంతోష్, మ యూర్ చంద్ర, దయాకర్ పాల్గొన్నారు.
బంజారా భవన్‌కు భూమి పూజ
ఆదిలాబాద్ పట్టణంలోని కైలాశ్‌నగర్‌లో బంజారా భవన్ నిర్మాణానికి ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, బోథ్ ఎ మ్మెల్యే అనిల్‌జాదవ్ భూమిపూజ చేశారు. ఐక్యతతో ఉండి భవనాన్ని నిర్మించుకోవాలని వారు సూచించారు. అనంతరం మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ మృతిపట్ల మౌనం పాటించారు.