calender_icon.png 18 April, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ సెంటర్లపై నమ్మకం కలిగేలా పని చేయాలి

09-04-2025 11:25:06 PM

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): పోషక విలువలు గల ఆహారాన్ని అందించడంతో పాటు అంగన్వాడి కేంద్రాలపై నమ్మకం కలిగేలా అంగన్వాడి టీచర్లు పనిచేసి హైదరాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పథకాలపై మహిళా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావుతో కలసి కలెక్టర్ సమీక్షించారు.

శిశు విహార్, చిల్డ్రన్ హోమ్, రెస్క్యూ హోం అలాగే సఖి కేంద్రం నిర్వహణ, పోస్కో చట్టం అమలు, భేటీ బచావో -బేటి పడావో, హెల్ప్ లైన్ నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగన్వాడి కేంద్రాలకు ఎక్కువ మంది పిల్లలు హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి సూపర్వైజర్ నెలకు 15 సెంటర్లను, సిడిపిఓ 10 సెంటర్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో నివేదికలను ఆన్లైన్ ద్వారా పంపాలని సూచించారు. పోషణ పక్షం గోడపత్రికను ఆవిష్కరించి ఆవారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో డిఐఓ డాక్టర్ శ్రీధర్, సిడిపివోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.