నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా చేయూతను అందించాలని జిల్లా హోంగార్డుల సంఘం నాయకులు బుధవారం జిల్లా ఎస్పీ జానకి విన్నవించారు. హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి తమ సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా చేయూతను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యూనిస్ అలీ, రమేష్, రామకృష్ణ, రమణ పాల్గొన్నారు.