వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
ఖమ్మం, డిసెంబర్ 24 (విజయక్రాంతి): గ్రామాల్లో అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం రఘునాథపాలెం మండలంలోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. దోనబండ, ఈర్లపూడి, కోరబోడు తండా గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న అటవీ భూముల్లో ప్రజలకు ఉపాధి లభించేలా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సూచించారు.
గ్రామంలో శ్మశానవాటిక కోసం అవసరమైన భూమిని గుర్తించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలన్నారు. కోర్లబోడు తండా పంచాయతీ భవనానికి ప్రహరీ నిర్మించాలని, అంగన్‌వాడీ భవనానికి, లింకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, జీడ్పీ సీఈవో దీక్షా రైనా, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, తహసీల్దార్ విల్సన్ పాల్గొన్నారు.