calender_icon.png 9 March, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో 10 జాతీయ రహదారుల పనులు పూర్తి

09-03-2025 12:38:54 AM

  1. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు
  2. అందుకే మరికొన్ని రహదారుల పనుల్లో ఆలస్యం
  3. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా 10 జాతీయ రహదారుల పనులను పూర్తి చేశామని కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపో వడం వల్ల మరికొన్ని రహదారుల పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.

రూ. 6,280 కోట్ల వ్యయంతో 285 కిలోమీటర్ల మేర నిర్మించిన  జాతీయ రహదారులను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించనున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

ఆరాంఘర్ నుంచి శంషాబాద్‌కు ఆరు లేన్ల హైవే పూర్తయిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాళ్ల కోసం సిగ్నల్ ఫ్రీ రోడ్డు పనులు పూర్తయ్యాయన్నారు. వచ్చే నెలలో బీహెచ్‌ఈఎల్ ఫ్లు ఓవర్ పనులు కూడా పూర్తవుతాయన్నారు.

ఫ్లు ఓవర్ పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రీజినల్ రిం గ్ రోడ్డు విషయంపై గడ్కరీతో చర్చించినట్టు చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి రూ. 18,772 కోట్లు ఖర్చు అవుతుందని, అధికారులు ఇప్పటికే అంచనా వ్యయాన్ని సిద్ధం చేశారన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలపై మాకే పట్టింపు ఎక్కువ

రాష్ర్ట ప్రయోజనాల నిమిత్తం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభు త్వం చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమకే ఎక్కువ పట్టింపు ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. హమీల విషయంలో చేతులెత్తేశారని విమర్శించారు.

ఎన్నికల వేళ బీఆర్‌ఎ స్ ప్రభుత్వం రూ.7.50లక్షల అప్పులు చేసిందని పదేపదే చెప్పిన రేవంత్.. అంత అప్పు ఉన్నట్టు తనకు తెలియదని ఇప్పుడు చెప్ప డం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో సోనియాగాంధీ సంతకాలతో ఇచ్చిన గ్యారెంటీలకు ఇప్పటి వరకు అతీగతీ లేదని విమ ర్శించారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడా ది ఏప్రిల్ నుంచి ప్రొడక్షన్ ప్రారంభం కాబోతుంటే ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ కావాలంటూ సీఎం అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాజీపేటలో జరుగుతున్న పనులను వెళ్లి పరిశీలించాలన్నారు. లేదంటే కాంగ్రెస్ మంత్రు లను తామే వందేభారత్ రైళ్లో తీసుకెళ్లి అక్క డ జరిగే పనులను చూపిస్తామన్నారు.

అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశు ద్ధి లేదన డానికి రూ. 1,200 కోట్ల ఎంఎంటీఎస్ పెండింగ్ నిధులే నిదర్శనమన్నారు. బకాయిలను చెల్లించకున్నా.. తానే చొరవ తీసుకుని ఎంఎంటీఎస్‌ను పట్టాలెక్కించానన్నారు.

వాళ్లవి బోగస్ మాటలు

డీలిమిటేషన్ వల్ల తెలంగాణతోపాటు దక్షిణాదిలో ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభలో స్పష్టంగా చెప్పినట్టు గుర్తుచేశారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సీఎం రేవంత్ రెడ్డివి బోగస్ మాటలని కొట్టిపారేశారు.

ఏ ఒక్క రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. కొత్త విద్యావిధానంలో మాతృభాషలకు తమ ప్రభుత్వమే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. త్రిభాష సిద్ధాంతం సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిందని గుర్తు చేశారు.

జన గణన అనంతరం తర్వాత రీఆర్గనైజేషన్ కమిటీ వేశాక అందులో మార్గదర్శకాలు వస్తాయని, వాటిపై ఇప్పటి వరకు కేంద్రం చర్చించలేదన్నారు. దివాలాకోరు రాజకీయాలు దేశానికి మంచిది కావని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా హితవు పలికారు.