ఎమ్మెల్యే పాయల్ శంకర్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వీలినమైన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 170 కాలనీ, టీచర్స్ కాలనీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించి, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇటీవల కాలనీలో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు కాలనీవాసులు తమ దృష్టికి తీసుకోవచ్చారన్నారు. దింతో కోటి 60 లక్షలు ఆదిలాబాద్ మున్సిపాలిటీ నిధులతో ప్రత్యేకంగా వీలిన కాలనీల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు స్వామి రెడ్, కృష్ణ యాదవ్, దారట్ల జీవన్, అశోక్ రెడ్డి, విజయ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.