ఈ జనరేషన్ మహిళలు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంటితో పాటు ఆఫీసు బాధ్యతలు నిర్వర్తించడం కొంచెం కష్టమే. అయితే వర్క్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తే ఈజీగా ఒత్తిడిని చిత్తు చేయొచ్చు. ఎలాంటి టెన్షన్ లేకుండా రోజువారి పనులను చక్కదిద్దుకోవచ్చు. అందుకోసం గంటలకొద్ది సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. డైలీ లైఫ్‌లో అరగంట సమయం కేటాయిస్తే చాలు
చాలామంది మహిళలు బిజీ లైఫ్ వల్ల రన్నింగ్, జాగింగ్ లాంటివాటికి దూరంగా ఉంటారు. అయితే ప్రతిరోజును నడకతో ప్రారంభిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. మార్నింగ్ వాక్ చేయడం వల్ల రోజంతా హుషారుగా ఉండొచ్చు. పొద్దుగాలే పచ్చని పరిసరాల్లో నడవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. నడక వీలుకాకపోతే మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఆహ్లదకరమైన వాతావరణంలో ధాన్యం చేయడం వల్ల మనసు తేలికగా ఉంటుంది. అనవసర ఆందోళనలు దూరమవుతాయి.
స్టాడింగ్ డెస్క్
గంటల తరబడి ఒకే ప్లేస్‌లో కూర్చోడం వల్ల త్వరగా అలసట వస్తుంది. అలాంటప్పుడు వర్క్‌ప్లేస్‌లో స్టాండింగ్ డెస్క్ ఏర్పాటు చేసుకోవచ్చు. నిలబడి పనిచేయడం వల్ల బాడీలో కదలికలు ఏర్పడి రీఫ్రెష్‌ను ఇస్తాయి. కాబట్టి మీ వర్క్ ప్లేస్‌లో స్టాడింగ్ డెస్క్ ఉంటే పనిచేసుకోండి. ఒకవేళ డెస్క్ లేకపోతే మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ వర్క్ ప్లేస్‌ను మార్చుకోండి.
ఆరుబయట కొద్దిసేపు
ఆఫీస్ విధుల్లో భాగంగా క్లుంట్స్, కస్టమర్స్‌తో ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు డెస్క్ దగ్గరనే కూర్చొని మాట్లాడకుండా.. అలా కొద్దిసేపు ఆఫీస్ ఆరుబయట నడుస్తూ ఫోన్ కాల్స్‌ను మాట్లాడవచ్చు. జూమ్ కాల్స్ ఏవైనా నడుస్తూ మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. దీని వల్ల ఆఫీసు వర్క్ కంప్లీట్ అవ్వడంతో పాటు తగినంత నడక లభిస్తుంది. కాబట్టి రోజులో ఒకసారైనా ట్రై చేసి చూడండి.
స్ట్రెచింగ్స్
బిజీలైఫ్ వల్ల చాలామంది జిమ్‌కు వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి అలాంటివారు స్ట్రెచింగ్ చేయొచ్చు. ప్రతి గంటకు ఒకసారి బాడీ స్ట్రెచింగ్ చేయడం వల్ల రిలాక్స్ అయిన ఫీల్ కలుగుతుంది. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా స్ట్రెచింగ్ చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది. వర్క్ ప్లేస్‌లో స్టాడింగ్ డెస్క్ ఉంటే ట్రై చేయండి.
డెస్క్ ఎక్సర్‌సైజ్
ప్రస్తుతం చాలా కంపెనీలు ఉద్యోగులకు అనువైన వ ర్క్ ప్లేస్‌ను ఏర్పాటుచేస్తున్నాయి. డెస్క్ దగ్గరే చిన్న చిన్న వ్యాయామాలు చేసేలా వసతులు కల్పిస్తున్నాయి. అలాంటప్పుడు మార్నింగ్ లేదా ఈవినింగ్ డెస్క్‌ను సపోర్ట్ చేసుకొని లెగ్, హ్యాండ్ ఎక్సర్ సైజ్‌లు చేసుకోవచ్చు.