నిర్మల్ (విజయక్రాంతి): పోలీస్ యంత్రాంగం పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంటుందని విధి నిర్వహణలో పోలీసులు నిజాయితీగా నిబద్దతతో పనిచేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పోలీసులకు మార్గనిర్దేశం చేశారు. పోలీస్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణల వల్ల ప్రజలకు ఎంతో మేలు చేయవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు. సమయపాలన పాటించాలని అర్జీదారుల పట్ల మర్యాదగా వివరించాలని చట్టాల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు అవినాష్ కుమార్, ఉపేందర్ రెడ్డి, జిల్లా పోలీసులు పాల్గొన్నారు.