అధ్యాపకులకు టీచర్స్ డే శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యాప కులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, వారిని సమాజానికి అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమన్నారు.
దశాబ్ధాలుగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో అధ్యాపకులు కీలకపాత్ర పోషించారని, అలాంటి గురువులను ప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తుందని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. సమాజంలో ఉన్నత పాత్ర పోషిస్తున్న ఉపాధ్యా యుల కోసం 15 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతి సమస్యను పరిష్కరించి, బదిలీలు చేపట్టామన్నారు. ఖాళీల కొరతను అధిగమించేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు గుర్తు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో ఉపాధ్యాయ సమాజం విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత అంకిత భావంతో పని చేయాలని సీఎం కోరారు.