కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని చిల్లాటిగూడ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనికి సీఎం సహాయం నిధి లక్ష రూపాయల ఎల్ఓసిని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటులో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థికంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గుండి మాజీ సర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.