calender_icon.png 12 January, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోంగార్డుల సంక్షేమానికి కృషి

06-12-2024 10:59:33 PM

నిర్మల్ (విజయక్రాంతి): హోంగార్డుల సంక్షేమానికి పోలీస్ శాఖ ద్వారా అన్ని విధాల కృషి చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో హోంగార్డ్ ల 62వ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ సేవలను కొనియాడారు. హోంగార్డ్ లకు ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శేఖర్, నిరంజన్, రామ్, రమేష్, కృష్ణ, వినయ్, రాజు, శేఖర్ పాల్గొన్నారు.