calender_icon.png 9 February, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలమల ఐక్యతకు కృషి

08-02-2025 10:27:34 PM

వెలమ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..

మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు..

కామారెడ్డి (విజయక్రాంతి): వెలమల ఐక్యతతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు అన్నారు. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా వెల్మ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లోయపల్లి అనిత నర్సింగ్ రావు పద్మనాయక వెలమ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో, ముఖ్యఅతిథిగా హాజరైన లోయపల్లి నర్సింగరావు మాట్లాడారు. వెలమల అని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా గండ్ర మధుసూదన్ రావు, ఉపాధ్యక్షులుగా గౌరనేని మధుసూదన్ రావు, జలగం సుజాత రావు, ప్రధాన కార్యదర్శిగా రాజాగంభీర్ రావు, కోశాధికారిగా రాజేశ్వరరావును, కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు, గడీల బాబురావు, ఐలేని రవీందర్రావు, సంజీవరావు, దామోదర్ రావు ఇతర ముఖ్య వెలమ బంధువులు, మిత్రులు వివిధ గ్రామాల నుండి వచ్చి పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లోయపల్లి నర్సింగ్ రావు మాట్లాడుతూ... ఏకగ్రీవంగా ఎన్నికైన కామారెడ్డి వెలమ అసోసియేషన్ సభ్యులకు, బంధుమిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రాజాగంభీర్ రావు మాట్లాడుతూ.. వెలమ బంధువులంతా ఒక తాటిపై ఉండాలని, వెలుమలో నిరుపేద కుటుంబాలకు, కామారెడ్డి వెలమ అసోసియేషన్ నుంచి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలమ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.