calender_icon.png 19 November, 2024 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కోసం పనిచేయాలి

19-11-2024 02:14:58 AM

  1. తెలంగాణ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి
  2. బీజేపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం, నవంబర్ 18: బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని ఓ ప్రైవేటు హాలులో సోమవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.

తెలంగాణ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసే విధంగా పార్టీ పనిచేయాల్సి ఉందని, ఈ క్రతువులో కార్యకర్తలు, నాయకులు సైతం భాగస్వాములు కావాలని సూచించారు. దీనిలో భాగంగా సమాజంలో ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించొద్దని, అందరినీ కలుపుకొని పోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

దేశంలో కాంగ్రెస్ పాలన లో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ దివాళా తీస్తున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ లు అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

కొందరు బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని మాట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ గతంలో కలిసి పోటీ చేసిన సంగతిని ఎవరూ మరచిపోవద్దని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆర్‌ఆర్ ట్యాక్స్ అప్పగిస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళ నకు రూ.1.50 లక్షల కోట్లు ప్రకటించిన సీఎం, అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తా రో తెలపాలని సవాల్ విసిరారు.

ప్రభుత్వం కేవలం అప్పులు తీసుకురావడానికే ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందని, అప్పుల్లో నూ కమీషన్లు కోట్టేసే విధంగా విధానం సాగుతున్నదని ఆరోపించారు. సమావేశం లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, ఎంపీ ఈట ల రాజేందర్, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఇతరనాయకులు బంగారు శృతి,  రాంచందర్‌రావు పాల్గొన్నారు.