కోటి 34 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
కోదాడ (విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గణపవరం గ్రామ పరిదిలోని గణపవరం క్రాస్ రోడ్డు నుండి గ్రామంలోకి ఎమ్ ఆర్ ఆర్ నిధులతో సుమారు 50 లక్షల రూపాయలతో రెన్యువల్ బిటి రోడ్డు, అదేవిధంగా గణపవరం గ్రామం నుండి ఎర్రవరం రోడ్డు వరకు సి ఆర్ ఆర్ నిధులు 84 లక్షలతో నూతన బీటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల,మండల పార్టీ అధ్యక్షులు తుమాటీ వరప్రసాద్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామరెడ్డి, మాజీ ఎంపీటీసీ హిమబిందు సుమన్ రెడ్డి, అమరనేని వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవూరి వెంకటాచారి, దేవాలయ చైర్మన్ లక్ష్మారెడ్డి, నారపరెడ్డి, కాసాని సత్యం, కాసాని శీను కొండ నరసింహారావు, బండి సత్యం ,ముత్యాలు, డాక్టర్ గురవయ్య, వెంకట్రావు , ఆనాగ ప్రసాద్, కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ రెడ్డి, గంగిరెడ్డి కన్నారెడ్డి, గ్రంధాలయ చైర్మన్ వట్టికుటి వెంకటేశ్వర్లు, లతీఫ్, మధు, బండి చిన్నకోటయ్య, వజీర్, మౌలానా, జానీ, లతీఫ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.