ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, ఆగస్టు 3 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని నాచారం వెస్ల్లీ స్కూల్‌ను శనివారం ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే భోజనాన్ని పరశీలించి.. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభి వృద్ధికి తనవంతు కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు.. సాయిజెన్ శేఖర్, ముత్యంరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.