calender_icon.png 4 October, 2024 | 3:00 AM

పరిశ్రమల అభివృద్ధికి కృషి

04-10-2024 12:48:52 AM

టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

కాప్రా, అక్టోబర్ 3: రాష్ట్రవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని సిరి గార్డెన్‌లో కాప్రా చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నూతన కార్యవర్గ సమావేశానికి ఆమె స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి హాజరయ్యారు.

ఆమె మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన, మధ్య తరహా పరిశ్రమలను అదుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పని చేస్తున్నామని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ మరింత పటిష్టం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, టీఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, ఐలా కమిషనర్ ప్రభాకర్, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, కొత్త రామారావు, పావనీ మణిపాల్‌రెడ్డి, కాప్రా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల యజమానుల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు దుర్గం యాదయ్య యాదవ్, విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు మచ్చ అశోక్‌గౌడ్, మోహన్ సిద్ధ్దు, కోశాధికారి దామోదర్‌చారి, సంయుక్త కార్యదర్శి హిరాలాల్, కార్యనిర్వహక కార్యదర్శి రాజేశ్‌రెడ్డి, రోషిరెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు.