- మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ
- సంగారెడ్డి కలెక్టరేట్‌లో గీత కార్మికులకు రక్షణ కిట్ల పంపిణీ
సంగారెడ్డి, నవంబర్ 6 (విజయక్రాంతి): కల్లు గీత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఇన్‌చార్జి, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు.
గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం నీరా కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని తెలిపారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి, సెట్విన్ చైర్మన్ గిర్‌ధర్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అహ్మద్, కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎక్సైజ్ అధికారి నవీన్‌చంద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, గ్రంథాలయ చైర్మన్ అంజయ్య పాల్గొన్నారు.