పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ పండుగుల జయశ్రీ రాజు
అబ్దుల్లాపూర్‌మెట్: పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కాలనీ వాసులకు మౌలిక సదుపాయల కోసం కృషి చేస్తానని పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్ పర్సన్ పండుగుల జయశ్రీ రాజు తెలిపారు. పెద్ద అంబర్పేట్ 7వ వార్డు సీసీ రోడ్ల నిర్మాణం కోసం సోమవారం వార్డు కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి, ఇతర కౌన్సిలర్‌తో కలిసి నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయల కోసం నిరంతరం కృషి చేస్తానని.. అలాగే ఎప్పటికప్పుడు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిద్దంకి కృష్ణారెడ్డి, కో–ఆప్షన్ సభ్యులు ఖాలీమ్, నాయకులు విజేందర్‌రెడ్డి, బొర్ర సురేశ్, మున్సిపల్ కమీషనర్ ఎస్ రవీందర్‌రెడ్డి, డీఈ శివానందం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.