calender_icon.png 10 January, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాభివృద్ధికి కృషి

18-09-2024 03:17:50 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మండలంలోని గుండి ప్రభుత్వ పాఠశాలను పదవ తరగతిగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేయడంతో బుధవారం గుండి మాజీ ఎంపీటీసీ గాధవేని మల్లేష్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే అదనపు కలెక్టర్ దీపక్  తివారిలను శాలువాతో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల సైతం ప్రభుత్వ విద్యాసంస్థలను ఆదరించి తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించాలని కోరారు.

పాఠశాల  ఉన్నతీకరణకు సహకరించిన మంత్రి సీతక్క, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ,డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, కలెక్టర్ వెంకటేష్ దోత్రే,విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ లింగయ్యకు మాజీ ఎంపిటిసి మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఏటా విద్యార్థులు గుండి నుండి జిల్లా కేంద్రం వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కునే వారని వర్షాకాలంలో గుండి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోవడం ద్వారా విద్యార్థులు విద్యకు దూరమయ్యే వాళ్ళని తరగతి గది ఉన్నతీకరించడంతో సమస్య తీరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఈవో ఉదయ బాబు, నాయకులు అబ్దుల్లా, అమన్, దత్తు, శ్యామ్ రావు ,అసద్ గ్రామస్తులు పాల్గొన్నారు.