calender_icon.png 25 April, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలతల ప్రకారం పని చేయాలి

24-04-2025 10:58:42 PM

పనికి తగ్గ వేతనం వస్తుంది...

తాడ్వాయి (విజయక్రాంతి): ఉపాధి హామీలో కొలతల ప్రకారం పనిచేయాలని ఉపాధి హామీ ఎపిఓ కృష్ణ గౌడ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్, తాడ్వాయి గ్రామాల్లో ఆయన గురువారం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం కొలతలు ఉంటాయని, ఆ కొలతల ప్రకారం పని చేస్తేనే డబ్బులు బాగా వస్తాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన కొలతల ప్రకారం గరిష్టంగా రోజుకు రూ. 307 రూపాయలు కూలి పడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ పనులను పరిశీలించారు. మీ కూలి ఎంత పడుతుంది మీరు ఎలా పని చేస్తున్నారు అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం పని చేస్తేనే మంచి రూపాయలు తీసుకోవచ్చని ఆయన కూలీలకు తెలిపారు. ప్రభుత్వం ఒక కుటుంబానికి వంద రోజులు పని కల్పించే ఉద్దేశంతో చట్టాలు రూపొందించిందని తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణం పండ్ల తోటల పెంపకం, నూతన భవన నిర్మాణం తదితర పనులను ఉపాధి హామీలో చేపట్టవచ్చని తెలిపారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు ఎక్కువగా తవ్వుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.