ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్‌పై విజయం
పారిస్: బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ లక్ష్యసేన్ అదరగొట్టాడు. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న లక్ష్యసేన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21 21 భారత్‌కే చెందిన సహచర షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేశాడు. 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ ముందు ప్రణయ్ నిలవలేకపోయాడు. తద్వారా లక్ష్యసేన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌లో ప్రవేశించిన మూడో ఆటగాడిగా నిలిచాడు.
ఇంతకముందు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్‌లు 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. క్వారర్స్‌లో లక్ష్యసేన్ చైనీస్ తైఫీకి చెందిన టియోన్ చెన్‌తో తలపడనున్నాడు. లక్ష్యసేన్ ఇదే జోరు కొనసాగిస్తూ క్వార్టర్స్‌లో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టి భారత్‌కు పతకం ఖాయం చేయాలని కోరుకుందాం.
నిరాశపరిచిన సాత్విక్ జోడీ
బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. ఎన్న ఆశలు పెట్టుకున్న సాత్విక్ సాయిరాజ్‌ెేచిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో సాత్విక్ జంట 21 14 16 మలేషియా ద్వయం ఆరోన్ చియా వూయి చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌ను ఈజీగా గెలిచిన సాత్విక్ జోడీ రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో కాస్త పోటీ ఇచ్చినప్పటికీ లాభం లేకపోయింది.
ఒలింపిక్స్‌కు ముందు జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ లో ఈ జోడీ స్వర్ణం సాధించడంతో ఈసారి విశ్వక్రీడల్లో కచ్చితంగా పతకం తీసుకొస్తారని అంతా ఆశించారు. కానీ ఈ జోడీ క్వార్టర్స్‌కే పరిమితమై నిరాశపరిచింది. తెలుగు షట్లర్ పీవీ సింధూ ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. ప్రిక్వార్టర్స్‌లో సింధు 21 21 చైనా షట్లర్ హె బింగ్‌జియావో చేతిలో పరాజయం చవిచూసింది. ప్రిక్వార్టర్స్ వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకొచ్చిన సింధూ కీలక పోరులో చైనా గండాన్ని దాటడంలో విఫలమైంది.