calender_icon.png 25 October, 2024 | 4:02 AM

వండర్ వలీ

17-07-2024 07:10:35 AM

రన్నింగ్‌లో 21 పతకాలు

లండన్: పారాలింపిక్స్‌లో పాల్గొనడమే తన జీవిత లక్ష్యమని అఫ్గానిస్థాన్ కమ్ ఇంగ్లండ్ అథ్లెట్ వలీ నూరీ తెలిపాడు. చిన్నప్పటి నుంచి కాబుల్ పర్వతాల్లో రన్నింగ్ చేయడాన్ని ఇష్టపడిన వలీ నూరీ అథ్లెట్‌గా రాణించాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్లే చిన్నతనం నుంచి రన్నింగ్, బాక్సింగ్‌పై దృష్టి సారించాడు. 18 ఏళ్లు వచ్చేసరికి వలీ నూరీ బ్రిటీష్ ఆర్మీలో ట్రాన్స్‌లేటర్‌గా ఉద్యోగంలో  చేరాడు. జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో 2009లో వలీ జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది.

ఉద్యోగ రిత్యా పెట్రోలింగ్ సమయంలో నూరీ ప్రమాదవశాత్తూ ఐఈడీ (ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ బాంబు)పై కాలు పెట్టాడు. బాంబు తీవ్రతకు గాలిలో ఎగిరిపడిన అతడు ప్రమాదం లో రెండు కళ్లు పోగొట్టుకొని శాశ్వత అంధుడిగా మారిపోయాడు. అయితే బ్రిటీష్ ఆర్మీతో ఉన్న చొరవ వలీ నూరీకి బాగా ఉపయోగపడిం ది. 20 14లో అఫ్గానిస్థాన్‌ను వదిలేసిన వలీ కుటుంబంతో సహా ఇంగ్లండ్‌లోని కోల్చెస్టర్ నగరానికి మకాం మార్చాడు.

ఇక్కడి నుంచి వలీ నూరీ జీవితం పూర్తిగా మారిపోయింది. కోల్చెస్టర్ క్లబ్‌లో కొంతమంది మిత్రుల సహకారంతో రన్నింగ్, మారథాన్‌లపై దృష్టి సారించాడు. ఐదేళ్ల పాటు కఠోర శ్రమ, సాధనతో వలీ నూరీ పూర్తిస్థాయి అథ్లెట్‌గా మారాడు. ఇప్పటివరకు రన్ని ంగ్‌లో 21 పతకాలు, స్విమ్మింగ్‌లో మూడు పతకాలు సాధించాడు.