14-04-2025 05:21:07 PM
నడిగూడెం: నడిగూడెం రామాలయ ఆలయ పూజారి వారణాసి మురళీ మోహన శర్మ మనవరాలు లక్ష్మీనారాయణ, స్రవంతిల కుమార్తె అవిజ్ఞ అరుదైన రికార్డు సాధించారు. రవీంద్రభారతిలో ఈ నెల 12న నిర్వహించిన అన్నమాచార్య కీర్తనల ప్రదర్శనలో 108 పాటలను 108 నిమిషాల్లో ప్రదర్శించిన పోటీల్లో పాల్గొని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందారు. అరుదైన రికార్డు సాధించిన చిన్నారి అవిజ్ఞ ను పలువురు అభినందించారు. తన ప్రదర్శన గాను సర్టిఫికెట్ మెమొంటోను నిర్వాహకులు నుంచి అందుకున్నారు. గతంలో రవీంద్రభారతిలో అన్నమాచార్య జయంతి ఇతర కార్యక్రమాల్లో అవిఘ్న పాల్గొని తన ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం మూడవ తరగతి చదువుతున్న అవిజ్ఞ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. గ్రామస్తులు అవిజ్ఞ ను అభినందించారు.