calender_icon.png 16 April, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవర్ లిఫ్టింగ్ లో మాస్టర్ టీం ఛాంపియన్ షిప్ కైవసం

14-04-2025 07:43:42 PM

జిల్లా జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి..

భద్రాచలం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు జిల్లాల స్థాయి బెంచ్ ప్రెస్ టీం ఛాంపియన్షిప్ పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాస్టర్స్ టీం ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నట్లు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మాస్టర్  విభాగంలో గుగులోతు శోభన్  నాయక్ కు, మాస్టర్ 1 విభాగంలో 105  కేజీల కేటగిరిలో రజిత  పతకం, దుర్గేశ్వరరావు కు మాస్టర్ 4 విభాగంలో,74 కేటగిరిలో బంగారు పతకం, డివి శంకర్రావు కు మాస్టర్ 4 విభాగంలో 83 కేజీ కేటగిరీలో బంగారు పతకం భవానీ ప్రసాద్ కు మాస్టర్ 2 విభాగంలో  93 కేజీ కేటగిరీలో బంగారు పతకం, కరుణాకర్ కు మాస్టర్ 2 విభాగంలో 93 కేజీ కేటగిరిలో రజిత పతకం, రంగారావు కు మాస్టర్ 2 విభాగంలో 105 క్యాటగిరిలో బంగారు పతకం, సాధించగా, సీనియర్ కేటగిరీలో రాజేష్ 74 క్యాటగిరిలో బంగారు పతకం , జూనియర్ విభాగంలో 66 కేజీల కేటగిరీలో  మోడెం వంశీకి  బంగారు పతకం, పర్సిక పాండురాజుకు, 53 కేటగిరిలో బంగారు పతకం సాధించడం జరిగిందని తెలిపారు.