05-04-2025 01:46:37 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ, ఏప్రిల్ 4 : మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 74 మంది లబ్ధిదారులకు శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.
తెలంగాణలోని ఆడపడుచుల ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. త్వరలో మహాలక్ష్మీ పథకం కింద మహిళలందరికీ రూ. 2500 ఇచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తుందని తెలిపారు. అంతకుముందు రామన్నపేట మండలం కక్కిరేణి, నకిరేకల్ మండలం కడపర్తి, చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. నకిరేకల్లో అధికారులతో కలిసి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు.