25 May, 2026 | 1:46 AM

మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలి

25-05-2026 12:00 AM

కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పిలుపు

రంగారెడ్డి జిల్లా, మే 24 (విజయక్రాంతి): జిల్లాలో ఈ నెల 25 నుండి 30 వరకు నిర్వహించనున్న ‘మహిళా వారోత్సవాలను’ అన్ని శాఖల సమన్వయంతో, ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమం, భద్రత, ఉపాధి లక్ష్యంగా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఆరు రోజుల కార్యాచరణను ప్రకటించారు.

మే 25న మహిళా సంఘాల ఐఎంఎస్ భవనాలకు భూమిపూజలు. అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవాలు, కొత్త భవనాలకు శంకుస్థాపనలు. పోషకాహార ప్రదర్శనలు, వంటల పోటీలు మరియు గర్భిణీలకు రక్తహీనత పరీక్షలుమే 26న మహిళా సంఘాల జీవనోపాధి కోసం ఆర్టీసీ బస్సుల ప్రారంభం, బాల్య వివాహ రహిత తెలంగాణ అవగాహన కార్యక్రమాలు, హెల్ప్లైన్ నంబర్లు 181, 1098 లపై విస్తృత ప్రచారం చేయాలి.

మే 27న ఆదాయ వనరుల పెంపునకు సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవాలతో పాటు కార్యాలయాల్లో మహిళల భద్రతకై ఫోక్సో చట్టం, షీ-బాక్స్ పోర్ట్ప అవగాహన సదస్సులు, మే 29 న మహిళా సంఘాలకు రుణమేళాలు, పౌల్ట్రీ, స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీ. వృద్ధ మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు, సంక్షేమ పథకాలపై అవగాహన,మే 30న ’ఉల్లాస్’ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత సాధించిన మహిళలకు సన్మానం.

స్నేహా బాలికల కోసం మాక్ పార్లమెంట్ నిర్వహణ. అమ్మ మాట  అంగన్వాడీ బాట ద్వారా పిల్లల నమోదు, యూనిఫామ్ల పంపిణీ. మహిళల ఆర్థిక సాధికారత, భద్రత, బాలికల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి, డీఆర్డీఏ పీడీ శ్రీలత, మెప్మా పీడీ వెంకట నారాయణ, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.