calender_icon.png 10 March, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

10-03-2025 12:51:30 AM

దౌల్తాబాద్, మార్చి 9:  మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే సమాజం లో గౌరవం పొందుతారని ఏఆర్డిఓ జిల్లా ఇంచార్జ్ రజిని పేర్కొన్నారు. మండల పరిధిలోని మల్లేశంపల్లి గ్రామంలో ఏఆర్డిఓ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో నైపుణ్యం సాధించు కొని ఆర్థికంగా ఎదగడానికి దారులను వెతుక్కోవాలని సూచించారు. అంగన్వాడి నుండి అంతరిక్షం దాకా మహిళలు అనేక అద్భుత విజయాలు సాధిస్తున్నారని, వారిని ఆదర్శం గా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

నైపుణ్య శిక్షణ లేక గ్రామీణ ప్రాం తాలలో మహిళలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారి ఇబ్బందులు తీర్చడానికే సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దీనిని గ్రామీణ ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రాజు రెడ్డి, పలువురు నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.