calender_icon.png 4 March, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత..

03-03-2025 08:01:52 PM

హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీ శిఖా గోయల్ ఐపీఎస్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణలో మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీ శిఖా గోయల్ ఐపీఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం నెక్లెస్ రోడ్ లో యెల్లో రిబ్బన్ రన్ యొక్క రెండవ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఎండోమెట్రియోసిస్ పై అవగాహనను పెంపొందించడానికి ఏర్పాటు చేసిన రన్ లో 1500 మందికి పైగా పాల్గొన్నవారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ... మహిళలు తమను ప్రభావితం చేసే సమస్యలను తెలుసుకొని వాటిపై స్వరం పెంచాలన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులను, ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ విమీ బింద్రాను అభినందించారు. బాలికలకు, మహిళలకు ఎండోమెట్రియోసిస్ పరిజ్ఞానంపై సాధికారత కల్పించే ఆరోగ్యకరమైన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ జాయింట్ ఎండీ డాక్టర్ సంగీత రెడ్డి పేర్కొన్నారు. ఎల్లో రిబ్బన్ 10కె, 5 కె, 3K పరుగులో పాల్గొన్న విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, సర్టిఫికెట్లను డాక్టర్ విమీ బింద్రా ప్రధానం చేశారు.