calender_icon.png 8 May, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా జైళ్ల అభివృద్ధి అవసరం

14-03-2025 12:00:00 AM

పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నేరాలను అదుపు  చేసి నేరస్తులను సక్రమంగా మార్చే వ్యవస్థలో పోలీ స్ శాఖతో పాటు జైళ్ల శాఖ కూడా ముఖ్యమైంది. ఉమ్మడి రాష్ట్రంలో జైళ్ల శాఖలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న  స్వరాష్ట్రంలో ఇంకా సమస్యలు కొన్ని తీరడం లేదు. జనాభాకు తగ్గట్టుగా రాష్ట్రంలో జైళ్ల అభివృద్ధి అవసరం కాబట్టి మహిళలకు ప్రత్యేక జైలు హైదరాబాద్ నగరంలో మాత్రమే ఉంది. వరంగల్ జైలు కూల్చివేసిన తర్వాత అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరంగల్ నుంచి మహిళా ఖైదీ లను హైదరాబాద్ తరలించడంతో స్పెషల్ మహి ళా జైలులో ఖైదీల సంఖ్య ఎక్కువ పెరిగింది. తర్వాత జైళ్ల శాఖ అధికారులు నర్సంపేటలో సబ్ జైలును మహిళలకు  కేటాయించడం జరిగింది.

కానీ వరంగల్ జైలు కూల్చివేసిన నష్టాన్ని అది భర్తీ చేయలేక పోతోంది.  హైదరాబాద్ రేంజ్‌లో ప్రత్యేక మహిళా జైలు ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల వారి కి, ఉద్యోగులకు సిబ్బందికి ఖైదీలకు సౌకర్యంగా ఉంది కానీ వరంగల్ రేంజ్‌లో  ప్రత్యేక మహిళా జైలు లేకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్ కరీంనగర్ వంటి జిల్లాలో ఉన్న సిబ్బందికి, ఖైదీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అన్ని సౌకర్యాలు ఉన్న జైలు లేకపోవడంతో హైదరాబాద్‌కు ఇక్కడ శిక్ష పడిన ఖైదీలను తరలించడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నర్సంపేట లో మహిళల కోసం సబ్ జైల్ ఏర్పాటుచేసినా అది  రాష్ట్ర బార్డర్‌లో ఉంది. అలాగే సిబ్బందికి, శిక్ష పడిన ఖైదీలకు కూడా దూరమే కాబట్టి కరీంనగర్‌లో లేదా  నిజామాబాద్‌లో ప్రత్యేక మహిళా సెంట్రల్ జైలు ఏర్పాటు చేస్తే సిబ్బందికి, శిక్ష పడిన ఖైదీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

ఆర్మూర్ సబ్‌జైలును తిరిగి తెరవాలి

వరంగల్ రేంజ్ పరిధిలోఉన్నకొన్ని సబ్ జైళ్లు మూసివేశారు. నిజామాబాద్‌ను సెంట్రల్ జైలు చేసి నా అది  నగరానికి దూరంగా ఉండటంతో  మహి ళా సిబ్బందిని కేటాయించినా ఇప్పటివరకు మహి ళా ఉద్యోగులు అక్కడ విధులు నిర్వహించడం లేదు. అక్కడ నియామకమైన సిబ్బంది అటాచ్మెంట్‌లతో ఇన్ని రోజులు వేరే జైల్లో విధులు నిర్వహిస్తున్నారు ఇన్ని రోజులు  మహిళా హోంగార్డులతోనే అక్కడ మహిళా జైలు నడిపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం, జైళ్ల శాఖ అధికారులు ఆలోచన చేసి అన్ని వసతు లు ఉన్నా నిజామాబాద్ సెంట్రల్ జైలు పరిధిలోగలఆర్మూర్ సబ్ జైలును మహిళా ప్రత్యేక జైలుగా అభివృద్ధి చేయాలి. నిజామాబాద్ సెంట్రల్ జైలు ను పూర్తిగా పురుషులకు కేటాయించి అర్ముర్ సబ్ జైలును మహిళా జైలుగా ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా అభివృద్ధి అవుతుంది.

ఆర్మూర్‌లో మహిళా సబ్ జైలు ఏర్పాటు చేస్తే మూసేసిన సబ్ జైలును కూడా తెరిచినట్లు అవుతుంది. భవిష్యత్తులో అభివృద్ధి కోసం జైళ్ల శాఖ భూములను కాపాడుకోవా లి. ఇప్పటికే గతంలో ఎన్నో భూములను  జైళ్ల శాఖ కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి నగరం మధ్యలో ఉన్న ఆర్మూర్ సబ్ జైలు స్థలంను కూడా వేరే శాఖలకు కేటాయించక ముందే అధికారులు ప్రభుత్వం తో చర్చలు జరిపి మూసేసిన ఆర్మూర్ సబ్ జైలును తిరిగి ప్రారంభించాలి. గతంలో నేర ఆరోపణలతో సీఎం జైలు జీవితం గడిపిన సందర్భంగా జైల్లో సమస్యలపై ఆయనకు ప్రత్యేక అవగాహన కూడా ఉంటుంది. తన కుటుంబానికి దూరంగా ఉండి జైల్లో ఉన్న సందర్భంగా ఖైదీలు పడే బాధలు, సిబ్బంది సమస్యలు సీఎంకు తెలుసు కాబట్టి ప్రస్తు తం అభివృద్ధి చెందుతున్న జైళ్ల శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలి.

పోలీస్ శాఖలో ఎంతో కీలకంగా పనిచేసిన మహిళా ఉన్నతాధికారిని జైళ్ల శాఖకు డైరెక్టర్ జనర ల్‌గా నియామకమైన నుంచి జైళ్ల శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకొని  సిబ్బంది, ఖైదీల సమస్యలను పరిష్కస్తున్నారు. మహిళా సిబ్బందికి న్యాయం చేసే విధంగా భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు.

ఆరోగ్య భద్రతే కరువు

పోలీస్ నియామక బోర్డు ద్వారా జైళ్ల శాఖ సిబ్బందిని నియమిస్తున్నారు. అందరి మాదిరిగానే  రాసే పోటీ పరీక్ష ఒక్కటే, పరిగెత్తిన పరుగు ఒక్కటే,  వేసుకున్న యూనిఫామ్ ఒక్కటే కానీ పోలీసు సిబ్బందికి ఉండే ఆరోగ్య భద్రత జైళ్ల శాఖ సిబ్బంది కి లేదు. ఏడాదికి ఒకసారి ఇచ్చే యూనిఫామ్ అలవెన్స్ పైసలు పోలీస్ సిబ్బందితో పోలిస్తే  జైళ్ల శాఖ సిబ్బందికి చాలా తక్కువగా ఇస్తున్నారు. నియామ కం ఒక్కటే కానీ నిబంధనలు వేరు.  ఎన్నో సంవత్సరాల నుంచి జైళ్ల శాఖ సిబ్బంది ప్రతి సందర్భంలో అడుగుతూనే ఉన్నారు కానీ అమలు కావడం లేదు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగం కానీ ఆరోగ్య సమస్య వస్తే భద్రత లేని బతుకులు వారివి కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి జైళ్ల శాఖ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాలి, అన్ని శాఖలకు ఇచ్చినట్లే  యూనిఫామ్ అలవెన్స్ పైసలు పెంచాలి.

రాష్ట్ర వ్యాప్తంగా కేవలం హైదరాబాదులో మా త్రమే స్పెషల్ మహిళా జైలు ఉంది. నేరం రుజువైన తర్వాత శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను హైదరాబాద్ మహిళా స్పెషల్ జైలులో ఉంచుతారు. కాబట్టి మహిళలకు అందుబాటులో ఉన్న జిల్లాలో స్పెషల్ మహిళా జైళ్లు ఏర్పాటు చేస్తే నేర ఆరోపణలు, శిక్ష పడిన మహిళా ఖైదీలకు మంచి మార్గంలో సంస్కరించి వారికి బయటకు పోయిన తర్వాత మళ్లీ నేరం చేయకుండా ఉపాధి, విద్య కల్పిస్తే వారిని సంస్కరించినట్లు అవుతుంది. వరంగల్ జైలు కూల్చకముం దు మహిళా ఖైదీలు కరోనా సమయంలో  జైలులో మాస్కులు కుట్టి ఎంతో ఆర్థిక లాభాలు తీసుకొచ్చా రు. అలాంటివే ఎన్నో ఉపాధి కార్యక్రమాలు చేపట్టే విధంగా రాష్ట్రంలో ప్రత్యేక మహిళా జైళ్లు ఏర్పాటు చేసి మహిళ ఖైదీలకు ఉపాధి విద్య లాంటి రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తే నేరాలు తగ్గించవచ్చు.

- ముచ్కుర్ సుమన్‌గౌడ్