13-03-2025 01:22:59 AM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : మహిళా సంఘాల అభివృద్ధిలో భాగంగా అందించే స్త్రీ నిధి రుణాలను వంద శాతం రికవరీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు కలిసి ఎ. పి. ఎం., సి. సి.లు, మెప్మా సిబ్బందితో స్త్రీ నిధి రుణాల రికవరీ, నూతన రుణాలు జారీ, ప్రమాద బీమా, బ్యాంకు లింకేజీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మెప్మా ప్రాజెక్టు అధికారి మోతిరామ్, సంబంధిత అధికారులు, స్త్రీ నిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.