05-03-2025 08:53:06 PM
మహిళా శక్తి ఆమ్ ఆద్మీ పార్టీ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రక్షణ, సాధికారత, సమానత్వం కోసం మహిళా దినోత్సవం జయప్రదం చేయాలని మహిళా శక్తి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు న్యాయవాది యమునా గౌడ్, సుధారాణి, డాక్టర్ లక్ష నాయుడు, హలో మౌనికలో అన్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విలేఖరుల సమావేశం అడ్వకేట్ యమునా గౌడ్, సుధారాణి, డాక్టర్ లక్షా నాయుడు, గాజుల మౌనిక మాట్లాడుతూ... భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిన ఇప్పటికీ మహిళకి స్వాతంత్రం కాదు కదా రోజురోజుకీ మహిళలపై దాడులు, అసమానత, అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు.
'బేటి పడావో బేటి బచావో' అనే నినాదం ఇచ్చిన మన ప్రధాని మోడీ, తన బిజెపి పాలక రాష్ట్రాల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయినా ఆయన మన్ కీ బాత్ లో మహిళా రక్షణ అని మాట్లాడుతున్నారన్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా కీచకులుగా మారి ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. సాక్షులను కూడా ప్రాణాలు తీస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. మహిళలు చదువుల్లో రాణించాలని, మహిళలు రాజకీయాలకు రావాలన్నారు. మహిళా సాధికారత సాధించాలన్నారు. మహిళలు సాధించిన విజయాలు అభినందించేందుకు, లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకు మహిళా దినోత్సవం ఉపయోగపడుతుందన్నారు.
2025 మహిళా దినోత్సవాన్ని ప్రతి మహిళకు, ప్రతి బాలికకు, హక్కులు, సమానత్వం, సాధికారత అనే నేపథ్యంలో నిర్వహించుకోవాలన్నారు. మహిళలు, యువతులు ముందుకు వెళ్లకుండా ఆపి అడ్డంకులను బద్దలు కొట్టడమే ఈ మహిళా దినోత్సవ ముఖ్య ఉద్దేశమన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రంలో అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రాంతా ఈ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా శక్తి విభాగం పిలుపునిస్తోందని పేర్కొన్నారు.