calender_icon.png 13 March, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిట్స్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

08-03-2025 11:16:03 PM

కోదాడ,(విజయక్రాంతి): స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ తెలిపారు.అలాగే మహిళలు వివిధ రంగాలలో సాధించిన కృషి విజయాలను గుర్తించడానికి వారిని అభినందించడానికి మహిళా దినోత్సవం మార్చి 8 వ తారీఖున జరుపుకుంటామని తెలిపారు. ముఖ్య అతిథిగా శ్రీమతి శ్రీవాణి గారు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సూర్యాపేట మాట్లాడారు. మహిళ పైలట్  ఉయ్యాల ఖ్యాతి మట్లాడారు. అడ్వకేట్ రాధాకృష్ణమూర్తి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్ నాగార్జున్ రావు పాల్గొన్నారు